సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చి 03, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18 న జరిగిన సంఘటనకు నిరసనగా రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక వాల్మీకి సర్కిల్ నుండి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఈ దుర్ఘటనలో పసికందు చనిపోయి నేటికీ 12 రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం అమానుషమని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇంత అమానుషమైన దాడి జరగడం సిగ్గు చేటు అని వారన్నారు.ప్రజాసంక్షేమ ప్రభుత్వం అని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు కానీ ప్రజాసంక్షేమ ప్రభుత్వంలో రజక,దళిత సామాజిక వర్గానికి చెందిన రెండు నెలల పసికందును కాలుతో పుట్ బాల్ లా తన్ని చంపడమే కాకుండా ఆ కుటుంబాన్ని 3 గంటల పాటు చిత్రహింసలకు గురిచేస్తూ బూతులు మాట్లాడిన ఎనిమిది మంది అగ్రవర్ణ వ్యక్తులపై హత్యకేసు పెట్టకుండా డిఎస్పీ సీఐ ఎస్సైలు కుమ్ముకై బాధితులపై కేసు పెట్టడం,బాధితులు ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకపోవడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వ్యవస్థలు ఎవరికోసం పనిచేస్తున్నాయో ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలారా గమనించాలనీ అన్నారు. రానున్న రోజుల్లో మన ఓటు మనం వేసుకుని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజ్యాధికారం కోసం పాటుపడాలనీ అప్పుడే మనపై దాడి చేయాలన్న, మన జోలికి రావాలన్నా అగ్రకులాలు భయపడతాయని వారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘానికి మద్దతుగా మండల కన్వీనర్ తిప్పయ్య,టీడీపీ సీనియర్ నాయకులు శేషగిరి, దుర్గయ్య, వైసీపీ మండల కన్వీనర్ షఫీఉల్లా, సిపిఐ,ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం నాయకులు, హమీద్, సలాం,రవికాంత్,వెంకటేష్,రంగన్న, నాగరాజు, హనుమంతు,రజక సంఘం నాయకులు కరెంటు మల్లికార్జున, క్లబ్ ఈరన్న,ఏరురు రమేష్.పెద్ద ఈరన్న,లక్ష్మణ మలికార్జున హనుమేష్ నాగేంద్ర, శ్రీను నాయకులు తదితరులు పాల్గొన్నారు.
