యాక్సెస్.టు.జస్టిస్, సౌజన్యంతో స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 03 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, యాక్సెస్,టు,జస్టిస్, సౌజన్యంతో స్కోప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన కొరకు ప్రచార రథం మోత్కూరు మండల కేంద్రం నకు విచ్చేసిన సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మార్వో జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని బాల్య వివాహాలు నిర్మూలన ద్వారా ఆడపిల్లల భవిష్యత్తు ఉన్నత చదువుల వైపు కొనసాగి భవిష్యత్తు బంగారు మయంగా తయారవుతాయి అన్నారు. స్థానిక సిఐ సి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ. బడి ఏడు పిల్లలంతా బడిలోనే ఉండాలని అప్పుడే బాలల హక్కులు పరిరక్షింపబడతాయి అన్నారు. సిడిపిఓ యామిని ప్రసంగిస్తూ గర్భస్థ శిశువు నుండి బాలల హక్కులు పరిరక్షింపబడడానికి ప్రభుత్వం ఎన్నో రకాలుగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. “స్కోప్” స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని అభినందించి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సి డబ్ల్యూ సి సభ్యులు కొనగల మల్లేశం, “నీడ్”ఎన్జీవో అధ్యక్షులు కే శ్రీశైలం ప్రసంగించారు. స్కోప్ సంస్థ మండల కోఆర్డినేటర్ కురిమేటి యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రచార రథం పాటిమట్ల, దాచారం, దత్తప్పగూడెం, పాలడుగు, అనాజిపురం, బుజిలాపురం తదితర గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *