మార్చి 4న హోలీ, 19న ఉగాది, 27న శ్రీరామ నవమి పటాన్చెరు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి అరుణ.. పటాన్చెరు తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని మార్చి 19వ తేదీన ఉగాది, మార్చి 4వ తేదీన హోలీ, మార్చి 27న శ్రీరామ నవమి పర్వదిన పండుగలు నిర్వహించుకోవాలని పటాన్చెరు డివిజన్ పరిధిలోని పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. సోమవారం ఉదయం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో పండుగల తేదీలు..ఏర్పాట్లపై పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పుర ప్రముఖుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేద పండితుల సూచన లకు అనుగుణంగా.. పైన పేర్కొన్న తేదీలలో పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో పండుగలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ జైపాల్, మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, ఆయా కుల సంఘాల అధ్యక్షులు, పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.