సాక్షి డిజిటల్ న్యూస్ , మార్చి 3 శంకరపట్నం కరీంనగర్ జిల్లా. సీనియర్ జర్నలిస్ట్. బి ఆర్.. తెలంగాణ రాష్ట్ర మాజీ సర్పంచ్ల సమావేశం సోమవారం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించారు . ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలల జిల్లా లోని జిల్లాల మండలాల. గ్రామాల మాజీ సర్పంచులు హాజరైనారు . ఈ సమావేశంలో మాజీ సర్పంచుల స్థితిగతులపై చేసిన అభివృద్ధి అంశాలపై ఐదు గంటలపాటు చర్చించారు . ఆర్థిక పరిస్థితులు స్థితిగతులపై చర్చించారు అనంతరం. రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగంపూర్ మాజీ సర్పంచ్ని ఏకగ్రీవంగా ప్రకటిం చారు. ఉపాధ్యక్షులుగా శ్యాం ప్రసాద్ వరంగల్ జిల్లా . శాంతయ్య మహబూబ్నగర్. రామేశ్వరరావు రవీందర్ ఆఫీస్ జనరల్ సెక్రటరీగా ప్రకటించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మాజీ సర్పంచ్ల భారతీయ ప్రజా ప్రతినిధుల మోర్ఛ అధ్యక్షునిగా చింతలపల్లె గ్రామం మాజీ సర్పంచ్ పల్లెపాపిరెడ్డి . జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్తగట్టు గ్రామ మాజీ సర్పంచ్ ముకిరాల కిషన్ రావు ను ప్రకటించారు రాష్ట్ర కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన వీరారెడ్డిని పాపిరెడ్డిని కిషన్ రావును మాజీ సర్పంచులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారతీయ సురక్ష సమితి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ యాదవ్ మాట్లాడారు. శక్తివంతమైన సమాజాన్ని ఏర్పాటు చేయుటకు కీలకంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. మాజీ సర్పంచులు సమన్వయంతో జకముక్క రాయి లాంటి లాగా తయారై పల్లెల్లో వెలుగునివ్వాలన్నారు. గ్రామ పంచాయతీలకు సర్వహక్కులు కలిగి ఉండే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హక్కుల సాధనకై పెద్ద ఎత్తున పోరాటాల నిర్వహిస్తామని ఆయన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు. మాజీ సర్పంచులకు కావాల్సిన హక్కులపై పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.. రాజకీయాలకు అతీతంగా పోరాటాల నిర్వహిస్తామని హెచ్చరించారు రాజకీయపరమైన వ్యత్యాసాలు ఉన్న మార్గం ఒకటేనని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో తెలంగాణలోని వివిధ జిల్లాల మండలాల గ్రామాల. మాజీ సర్పంచులు సర్పంచులు అధిక సంఖ్యలో హాజరైనారు