మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయం

*సామాజిక కార్యకర్త అంగోత్ మంగీలాల్

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 3, మణుగూరు /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న : శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో దివంగత నేత దుద్దిళ్ళ శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ళ శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయమని సామాజిక కార్యకర్త ఆంగోత్ మంగీలా అన్నారు. శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలు మార్చి 2 సోమవారం నాడు మణుగూరు మండలం సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో రామగుండం 1 జిఎం డి లలిత్ కుమార్ ప్రముఖ పాత్రికేయురాలు అనిత మేడం దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీపాద రావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సామాజిక కార్యకర్త అంగోత్ మంగీలాల్ మాట్లాడుతూ జననేతగా పేదల పక్షాన నిలబడిన నాయకునిగా మంథని ప్రాంతంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీపాదరావు సేవలను ఈ సందర్భంగా కొనియాడారు వారి స్ఫూర్తితో వారి కుమారుడు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దుద్దుల శ్రీధర్ బాబు కూడా తండ్రి బాటలో నడుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన ప్రశంసించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు సహా పంక్తి భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనితా మేడం లలిత్ కుమార్ ఉద్యోగ రీత్యా ఎక్కడ పని చేస్తున్నా కూడా మణుగూరు మర్చిపోరని ప్రత్యేకించి బాల వెలుగు పాఠశాలను గుర్తు పెట్టుకుని మరి సందర్భం ఏదైనా తగు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *