మహిళా దినోత్సవ వేడుకలకు మాద్రి తులసి లక్ష్మీ మరియు శ్రీమతి మాద్రి మానస (తన్విశ్రీ అడ్వకేట్) హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గ ప్రతినిధి అరుణ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో ఆర్యవైశ్య మహిళల సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు మరియు నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, ఎమ్ డి ఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ సతీమణి శ్రీమతి మాద్రి మానస (తన్విశ్రీ) (అడ్వకేట్) ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీమతి మానస (తన్విశ్రీ) మాట్లాడుతూ, సమాజ అభివృద్ధికి మహిళల పాత్ర అత్యంత ముఖ్యమైనది. విద్య, ఉపాధి, స్వయం సాధన ద్వారా మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలి. కుటుంబం నుండి దేశ స్థాయి వరకు మహిళల నాయకత్వం అవసరం. ఆత్మవిశ్వాసం, సంకల్పం ఉంటే మహిళలు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు. మహిళల సాధికారతే సమాజ పురోగతికి మూలాధారం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడెం యాదమ్మ , గూడెం కల్పన, హారిక, స్వప్న మరియు ఆర్యవైశ్య మహిళల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.