మహిళా దినోత్సవ వారం వేడుకలు ఘనంగా ఇందుకూరు పేట హై స్కూల్‌లో వ్యాస, ప్రసంగం, డ్రాయింగ్ పోటీలు.

(సాక్షి డిజిటల్ న్యూస్) దేవీపట్నం: రిపోర్టర్ కే ప్రకాశరావు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రభుత్వ హై స్కూల్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. మహిళా సాధికారతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు వ్యాస రచన, ప్రసంగం మరియు చిత్రలేఖనం పోటీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మహిళల పాత్ర, సమాజంలో వారి ప్రాధాన్యత, సమాన హక్కులు వంటి అంశాలపై తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించి బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందడమే కాకుండా మహిళల పట్ల గౌరవ భావన మరింత బలపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *