(సాక్షి డిజిటల్ రిపోర్టర్ విగ్నేష్ మార్చ్ 3) దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు ఎస్.ఐ అరుణ్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిని ఈ రోజు గజ్వేల్ కోర్టులో హాజరు పరచగా, గౌరవ న్యాయస్థానం వారికి ఒక్క రోజు సాధారణ జైలు శిక్ష విధించినట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉండి ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుందని ఎస్.ఐ అరుణ్ కుమార్ హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.