అందోల్ మార్చి 3 సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి జెల్ల భాగయ్య (సౌలు) జోగిపేట పట్టణపురోహితుల సూచన మేరకు ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో10వ వార్డు లో ఆచారం ఆనవాయితీ ప్రకారం కాముని దహన కార్యక్రమంను భక్తిశ్రద్ధలతో స్థానిక మాణిక్య ప్రభు మందిర్ కూడలి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఆ వార్డు మాజీ కౌన్సిలర్ తుపాకుల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గత దశాబ్దాల కాలంగా అదే కూడలిలో కాముని దహనం చేయడం ఆనవాయితీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కాముడీ దహనం చేశారు. వార్డుకు చెందిన పెద్దలు యువకులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గొల్ల శరత్ బాబు,బీర్ల శంకర్,ఉలువల సతీష్, వడ్ల నాగభూషణం, ఊస మాణిక్యం, నాగేష్ మాసగొని, రవి, జోగినాథ్, నాగరాజ్, మల్లేశం, రాముచందర్ ప్రభాకర్, సుధాకర్, శ్రీను, లడ్డు, పురుషోత్తం, మహేష్,అంజి, శివకుమార్, లక్ష్మణ్, సంతోష్, అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
