బోయిన్ పల్లి మార్కెట్ అభివృద్ధికి చర్యలు.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మార్చి 3. బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం మరియు అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే శ్రీగణేష్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సోమవారం బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గం మరియు అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోయిన్ పల్లి మార్కెట్ అభివృద్ధి, మార్కెట్ కు వచ్చే రైతులకు, హామాలీలకు సౌకర్యాలు, మార్కెట్ కు ఆదాయ వనరులను పెంచడం, మార్కెట్ లో పరిశుభ్రత, మార్కెట్ లో చేపట్టవలసిన మౌలిక వసతులపై మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గం, అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు, పాలకవర్గం పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.ముఖ్యంగా వే బ్రిడ్జి నిర్మాణం, అసంపూర్తిగా ఉన్న షాపుల నిర్మాణం, టాయిలెట్లు, తాగునీరు ఏర్పాటు చేయించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సమీక్షలో అధికారులకు తగిన సూచనలు చేసి, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని చెప్పారు. బోయిన్ పల్లి మార్కెట్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడంతో పాటు మార్కెట్ కు ఆదాయం కూడా పెరగడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమీక్షలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాగిరి ఆనంద్ బాబు, సెక్రటరీ వెంకటేష్, డైరెక్టర్లు శరత్, ప్రభాకర్, సంతోష్, అస్లాం, రామ్, జూలియస్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *