సాక్షి డిజిటల్ న్యూస్ మరికల్,మార్చి 3, 2026,( రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం పరిధిలోని మరికల్ గ్రామం నుండి పల్లె గడ్డ, పూసల్పాడు, మాధవరం గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు రహదారులు గుంతల మాయమై అద్వానంగా మారాయని మరికల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లంబడి తిరుపతయ్య విమర్శించారు. సోమవారం మరికల్ మండల కేంద్రంలోని పల్లె గడ్డ, పూసల్పాడు, మాధవరం గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్డు రహదారులను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ గ్రామాలకు వెళ్లే విపరీతంగా రాకపోకలు కొనసాగు తున్నాయన్నారు. దీంతో బీటీ రోడ్డు మారాయని ఆయన వివరించారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఇట్టి బీటీ రోడ్డు పనులను మరమ్మత్తులు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. లేనియెడల నిర్లక్ష్యంగా వహిస్తే పిటి రోడ్డు పనులు మరమ్మత్తులు చేసే వరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, మోహన్, ఆంజనేయులు, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
