బీజేపి పార్టీ ఓబిసి మోర్చ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు వర్షం వెంకట్ కి అభినందనల వెల్లువ

సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం, మార్చి 03: కాంగ్రెస్ పార్టీ కి సేవలు అందించి అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్థాపించడం తో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైసిపి పార్టీ తీర్థం పుచ్చుకుని రెండు పార్టీల లో సుదీర్ఘంగా 17 సం తన రాజకీయ ప్రయాణం లో పార్టీ లకు ఎన్నో సేవలు అందించి అందరి మన్ననలు పొందిన ఆనందపురం మండలం దుక్కవాని పాలెం కి చెందిన వర్షం వెంకట్ బీజేపి పార్టీ విధానాలకు, భారత దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచం లో ఉన్నత స్థాయి లో నిలబెట్టి బారత దేశం కీర్తి ప్రతిష్టలు పెంచిన నరేంద్ర మోదీ పాలనకు ముగ్ధుడై బీజేపీ పార్టీ లో చేరిన వర్షం వెంకట్ తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలు లో,పార్టీ సమావేశాలలో క్రమం తప్పకుండా పాల్గొంటూ, ఆనంద పురం మండలం లో గ్రామ గ్రామాల్లో భీజేపి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుండటం గమనించిన బీజేపి పార్టీ అధిష్టానం వర్షం వెంకట్ ను దుస్సాలువా తో ఘనంగా సన్మానించడం జరిగింది.బీజేపి పార్టీ లో సీనియర్ నాయకులు తో పాటు యువ రక్తం సుస్థిర స్థానం కల్పించడం జరుగుతుంది అని చెప్పడానికి వర్షం వెంకట్ ఒక ఉదాహరణ అని అని రాష్ట్ర ఓ.బి.సి మోర్చ ఉపాధ్యక్షులు పల్లి శ్రీనివాసరావు అన్నారు. రాబోయే రోజుల్లో భీమిలి నియోజకవర్గం లో బీజెపీ పార్టీ బలోపేతం కోసం మరింత బాధ్యత తో పని చేయాలని వర్షం వెంకట్ లో రాష్ట్ర నగరాల కార్పోరేషన్ డైరెక్టర్ పోతిన పైడిరాజు స్పూర్తి ని నింపడం జరిగింది. కష్టపడి పని చేసే వారికి బీజేపీ పార్టీ లో సుమచిత స్థానం, గుర్తింపు, తోడ్పాటు ఉంటుంది అని చెప్పడానికి ఈరోజు నెను జిల్లా స్థాయి పదవి లో ఉండటం అని వర్షం వెంకట్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమం పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *