పహిల్వాన్ పూర్ గ్రామ పంచాయతీని సందర్శించిన ఎంపీడీవో

సాక్షి డిజిటల్ న్యూస్ 03 మార్చి : వలిగొండ రిపోర్టర్ కుమారస్వామి, మండలంలోని పహిల్వాన్ పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలందర్ రెడ్డి సందర్శిం చారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ బద్దం కరుణాశ్రీ వార్డు సభ్యులు మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి పాల్గొని గ్రామంలో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న భూమి సమస్యను ఎంపీడీవో సమర్థవంతంగా పరిష్కరిం చారు. ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్న ఆ భూమిని చట్టపరమైన అధికారాలతో తిరిగి స్వాధీనం చేసుకుని, అదే స్థలంలో అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి ఇదే విధమైన మద్దతు అందించాలని వారు కోరారు.ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *