దేవరాపల్లిలోఅన్న సమారాధన కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ 3 మార్చి 2026 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండల కేంద్రం స్థానిక ఉమామహేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భారీ అన్న సమారాధన కార్యక్రమం సోమవారం నిర్వహించారు గత నెలలో శ్రీ ఉమా మహేశ్వరి తీర్థ కళ్యాణ మహో త్సవం ఐదు రోజులపాటు రంగ రంగ వైభవంగా ఆలయ కమిటీ నిర్వహించింది ఆ ఉత్సవాన్ని పురస్కరించు కొని సోమవారం భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది మండల కేంద్రం లోని ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబ్బవరపు పెంటమ్మ మాలి బాబు మండల టిడిపి పార్టీ అధ్యక్షులు పెద్దాడ వెంకటరమణ రైవాడ జలాశయం చైర్మన్ పోతల పాత్రనాయుడు మాడుగుల మార్కెట్ కమిటీ బోర్డ్ డైరెక్టర్ బంధం అప్పలరాజు దేవరాపల్లి కోఆపరేటివ్ చైర్మన్ పూడి సత్యా రావు వార్డ్ మెంబర్ కొల్లి ఈశ్వరరావు మాజీ సర్పంచ్ చల్లా తాతయ్యలు మాజీ మండల టిడిపి ప్రధాన కార్యదర్శి శరకాన సూర్యనారాయణ మండల మహిళ ఎస్సీ సెల్ అధ్యక్షురాలు బ్యూల నీటి సంఘం చైర్మన్ గుల్లిపల్లి మురళి వీ రమేష్ గవిరెడ్డి సింహ తదితరులు పాల్గొన్నారు.