తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ రాజేష్ ఖన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

సాక్షి డిజిటల్ న్యూస్, మార్చి 3, వరంగల్ రిపోర్టర్ జన్ను కోర్నెలు తెలంగాణ కాంట్రాక్ట్ మెడికల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర 4వ మహాసభల్లో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఎం.డి యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా ఎం. నరసింహ ఎన్నికైయ్యారు. కార్యనిర్వహాక అధ్యక్షులుగా ఎం లక్ష్మీబాయి, ఉప ప్రధాన కార్యదర్శి హసీనా బేగం ఉపాధ్యక్షులు రామ రాజేష్ ఖన్నా కార్యదర్శులుగా పల్లా దేవేందర్ రెడ్డి, వై. ఓమయ్య, ఏ.పార్వతి, పి.సురేష్, గన్నారపు రమేష్ కోశాధికారిగా జయలక్ష్మి , గా వైస్ ప్రెసిడెంట్లు భోగే ఉపేందర్, సిర్రా దేవేందర్, ఎస్. కిష్టమ్మ లతోపాటు 27 మందిని కార్యవర్గ సభ్యులుగా, 61 మందిని కౌన్సిల్ సభ్యులుగా 8 మందిని ఆహ్వానితులుగా ఈ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మహాసభలు విజయవంత
మయ్యాయని, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.డీ యూసుఫ్, ఎం.నరసింహ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మహా సభలో 470 మంది ప్రతినిధులు పాల్గొని అనేక సమస్యల పైన దాదాపు 40 మంది చర్చలలో పాల్గొని వివిధ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని ఇందుకు భవిష్యత్ పోరాటాలు నిర్వహించాలని మహాసభ తీర్మానాలను ఆమోదించినట్లు వారు వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయుచున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26000 ఇవ్వడంతో పాటు కనీస హక్కులన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియూసి) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల కాంట్రాక్టు కార్మికులు ఎలాంటి కనీస వేతనాలు అమలు గాని, కార్మిక చట్టాలు అమలకు నోచుకోకుండా, నిత్యం శ్రమదోపిడికి గురి అవుతున్నా రన్నారు. రాబోవు కాలంలో రూ.26,000 కనీస వేతనం, కార్మిక చట్టాల అమలు, పండగ, జాతీయ, ఆర్జిత సెలవులు అమలుకు, కనీస బోనస్, రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్ వేతనం ఔట్ సోర్సింగ్ కార్మికులకు అమలు అయ్యే విధంగా పోరాటాలు నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *