టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మకు అభినందనలు తెలిపిన టిడిపి నాయకులు

*ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బొజ్జమ్మలకు ఘన సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద, మార్చి 03, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మలను టిడిపి మండల నాయకులు బుడగ జంగాల రామాంజిని ఆస్పరి లోని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియ జేశారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు,పూలమాలలతో ఘనంగా సన్మానించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. నాయకత్వానికి అండగా ఉంటూ, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్న జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆలూరు ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి, రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ కప్పట్రాళ్ల బుజ్జమ్మలకు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *