జిల్లాలోని 6 అసెంబ్లీ నియో జక వర్గాలను వచ్చే 5 సంవత్సరా ల్లో ఏ విధంగా అభి వృద్ధి చేయాలనే దీర్ఘకాలిక లక్ష్యాల ప్రణాళిక 15 రోజులలో ప్రాధాన్యత అంశాలతో క్రోడీకరించి సమర్పించాలని

*జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు
. అమలా పురం సోమవారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ 15% వృద్ధిరేటు సాధన,,పి 4 బంగారు కుటుం బాల దత్తత తనిఖీ మరియు కి పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ అప్లోడ్ అంశాల ప్రగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నిర్దేశిత ప్రాధాన్యత అంశాల వారీగా లక్ష్యాలను సాధించడానికి తీసుకునే కార్యాచరణ చర్యలు ద్వారా జిల్లా అభివృద్ధికి పాటుపడుతూ రాష్ట్రంలో జిల్లాను ముందంజ లో నిలపాలన్నారు. ప్రాధాన్యత అంశాలైన తాగునీరు రహదా రులు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం,ఉపాధి గ్రామ,వార్డు స్థాయి డేటా సేకరణ లోటు పాట్ల విశ్లేషణ ప్రాధాన్యత, బడ్జెట్ అంచనా నిధుల వనరులు సమీకరణ వంటి అంశాలపై ఫోకస్ పెట్టాలన్నారు. నిర్దేశిత పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయో కొలిచే ప్రమాణాలైనా కి పెర్ఫార్మె న్స్ ఇండికేటర్స్ తాగునీరు శాతాలను, గ్రామాలకు పైపులైన్ కనెక్షన్ రహదా రులు పూర్తి చేసిన రోడ్ల కిలోమీటర్లు విద్య పాఠశాల హాజరు శాతం , ఆరోగ్యం PHC లో OP సందర్శనలు పింఛన్లు పంపిణీ శాతా లను ప్రతి నెల 5 వ తేదీన అప్లోడ్ చేయాలని ఆదేశిం చా రు. ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యం ఆధారంగా దత్తత కార్య క్రమం p4 సమర్థవంతంగా అమలు చేస్తూ కిందిస్థాయి నుండి పేదరిక నిర్మూలనకు పట్టం కట్టాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఈ పథకంలో మార్గద ర్శకులైన పది శాతం ధనికులు సమాజం లో కింది స్థాయి నుండి 20 శాతం బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని జీవన ప్రమాణాల బలోపేతానికి పాటుపడాల న్నారు .P4 దత్తత తనిఖీ చెక్‌లిస్ట్ ఆధారంగా సచివాల యం సిబ్బంది సమగ్ర తనిఖీ నిర్వహించి వేగవంతంగా అర్హులకు న్యాయం చేకూ ర్చాలన్నారు జిల్లాలో స్థూల దేశీయోత్పత్తి జిడీపీ పెంపును లక్ష్యంగా చేసుకుని స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్లాన్ యూనిట్ల ద్వారా సమగ్రంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్లాన్ యూని ట్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి, కి పెర్ఫార్మన్స్ ఇండికే టర్స్ పి 4 పథకం ప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను చేరు కోవాలన్నారు.రాష్ట్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లా విజన్ ప్లాన్ యూనిట్ను, 6 నియోజ కవర్గాల్లో ప్రత్యేక విజన్ ప్లాన్ యూనిట్లను ఏర్పాటు చేసినట్లు వివరిం చారు. ఈ యూనిట్లలో విధులు నిర్వ హించేందుకు యువ నిపుణులను నియ మించా మని, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తూ మండలాల స్థాయిలో ప్రగతికి తోడ్పడా లన్నారు. కనీసం 15 శాతం వృద్ధిరేటును తప్పనిసరిగా సాధించేలా పాటు పడాలన్నారు. ప్రతినెల ఐదో తేదీ నాటికి కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఓ మురళీకృష్ణ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *