అక్షర ఆయుధం న్యూస్ మార్చ్ 2. 2026 మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రిపోర్టర్ పంజాల సతీష్; పీఎంకేవై 4.0 కింద ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 3D ప్రింటింగ్ ఆపరేటర్ మరియు సి న్ సి ఆపరేటర్ టర్నింగ్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ కోర్సుల కాలపరిమితి 510 గంటలు ఉంటుంది.ఇందులో థియరీతో పాటు ప్రాక్టికల్ మరియు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ (OJT) కూడా ఉంటుంది. పదో తరగతి ఎస్ ఎస్ సి నుండి పీజీ వరకు చదువుతున్న ఎవరైనా ఈ కోర్సులకు జాయిన్ అవ్వడానికి అర్హులు.ప్రతి విభాగంలో కేవలం 30 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, ఈ నెల 06-03-2026 నుండి తరగతులు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ వెంట పదో తరగతి మార్కుల జాబితా జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, మొబైల్ నంబర్ మరియు వ్యక్తిగత ఈమెయిల్ తీసుకురావాల్సి ఉంటుంది. శిక్షణ సమయంలో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రభుత్వం తరపున గుర్తింపు పొందిన సర్టిఫికేట్ అందజేస్తారు. అలాగే శిక్షణ పొందిన అభ్యర్థులకు స్వయం ఉపాధి కోసం బ్యాంక్ రుణ సదుపాయాల గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:మరిన్ని వివరాలకు మరియు రిజిస్ట్రేషన్ కోసం ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు: G. పవన్ కుమార్: 7306352961,P. ప్రశాంత్: 9030728098,గవర్నమెంట్ ITI-ATC జన్నారం, మంచిర్యాల జిల్లా