ఘనంగా మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 89 వ జయంతి వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్, 03 మార్చ్ 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ తిరుకోవళ్లూరి సంజయ్ : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ విగ్రహం వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 89 వ జయంతి వేడుకలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుద్దిళ్ల శ్రీపాదరావు తెలంగాణకి ఎంతో సేవచేశారని, రాజకీయ నాయకులు, యువత ఆయను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. అంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు కృష్ణ, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కూర మల్లారెడ్డి, కౌన్సిలర్లు, అమిరిశెట్టి తిరుపతి, కల్లెపల్లి జానీ, నిషాద్ రఫిక్, అమిరిశెట్టి రాజలింగు, ముస్త్యాల రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిలుక సతీష్, భూషణవ్ సురేష్ గౌడ్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *