సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 03 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్, మోత్కూరు మండలం పాటిమట్ల గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హైస్కూల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు. విద్యార్థులు కలెక్టర్గా డీఈవోగా ఎమ్మెల్యేగా వివిధ హోదాల్లో కనిపించి పాఠశాలలో ఉత్తేజ తర్వాత వాతావరణాన్ని కలిగించారు ఉపాధ్యాయులుగా విద్యార్థులు బోధనలో చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. నేటి ప్రధాన ఉపాధ్యాయులుగా మొగులగాని మానస, కలెక్టర్గా చల్ల పల్లవి డిఈవోగా కొమ్మ మనీషా, డిప్యూటి డీఈవోగా పర్వతగిరి గ్రీష్మ, ఎమ్మెల్యేగా కురుమేటి శివ సాయి. ఉపాధ్యాయ బృందం ప్రధానోపాధ్యాయులు మిర్యాల దామోదర్ ఉపాధ్యాయులు ముక్కామల లింగమల్లు బండారు మల్లయ్య వంగూరి యాదయ్య దర్శనం వెంకన్న చిరుమర్తి యాదయ్య కే కవిత డి తిరుపతి కే కృష్ణవేణిలు పాల్గొన్నారు.