గ్రామీణ రహదారులకు మోక్షం

*రోడ్డు పనులు కు శంకుస్థాపన

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ( గంగాడ గౌరీ శంకర్ ) గ్రామీణ రహదారులకు కూటమి ప్రభుత్వంతోనే మహర్దశ పట్టనుందని పాలకొండ మండల పరిషత్ అధ్యక్షులు బొమ్మాలి భాను సుధాకర్ అన్నారు. సోమవారం నాడు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం అర్ధలి సిసి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఆదేశం మేరకు ఎన్ఆర్ఈజీఎస్ 9 లక్షల రూపాయల నిధులతో శిశిర్ రహదారి పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. దశాబ్దాల గ్రామస్తుల కల నెరవేరింది అని అన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోనే అన్ని గ్రామాలకు పక రహదారులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జయ కృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పోకిరి వెంకటరమణ పంచాయతీ మాజీ సర్పంచ్ బొమ్మాలి ఆదినారాయణ బొమ్మాలి సురేష్ రాగోలు పాపారావు డోల గోపి బొట్ట రాము బొమ్మాలి తోటయ్య లాషా కృష్ణ కుప్పిలి నాని బాబు లతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *