కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి

సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద మార్చ్ 3, కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప అన్నారు ఈ సందర్భంగా మండల పరిధిలోని నెరనికి గ్రామంలో టిడిపి ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు దాదాపుగ ఒక కిలోమీటర్ కరెంట్ ఆఫీస్ నుండి నెరనికి గ్రామంలోకి 50 లక్షలు రూపాయలతో సిసి రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు వారు తెలిపారు గత ప్రభుత్వ హాయంలో మా గ్రామంలో సిసి రోడ్డు గురించి ప్రజా ప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్న ఎవరు కూడా పట్టించుకోలేదని వారు తెలిపారు ప్రస్తుతం ఆలురు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వైకుంఠం జ్యోతి కి గ్రామస్తులు అర్జీ రూపంలో విన్నవించగా వెంటనే గ్రామ సంబంధిత అధికారులతో చర్చించి గ్రామానికి నిధులు మంజూరు చేశారని వారు తెలిపారు కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి ప్రధాన రహదారైన వర్షం వస్తే నడవలేని స్థితిలో ఉన్న ఈ రోడ్డు గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉండేదని గ్రామస్తులు తెలిపారు గ్రామానికి సిసి రోడ్డు రావడంతో గ్రామ ప్రజలు ఆనంద వ్యక్తం చేశారు నెరనికి గ్రామంలో భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులను కూటమి నాయకులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ వీరనాగప్ప మరియు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మల్లికార్జున్ సర్పంచ్ సోమప్ప మరియు గిరప్ప సుధా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.