కుటుంబ కలహాలతో యువకుడు ఆత్మహత్య.

సాక్షి డిజిటల్ న్యూస్ మార్చ్ 3 భూమయ్య పిట్లం. . పిట్లమ్మ మండలంలోని హస్నాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు సత్యం 41 సంవత్సరాల ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతురాజు సత్యం అనే వ్యక్తి గత 15 రోజుల క్రితం భార్యతో కొట్లాడి తిట్టడంతో మనస్థాపం చెందిన భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది అప్పటినుంచి తల్లి కొడుకు ఇద్దరే ఉంటున్నారు. సోమవారం నాడు ఉదయం తల్లి భోజనం చేసి వెళ్ళమని కొడుకుకు అడగగా ఇప్పుడు వచ్చి తింటాను అని చెప్పి వెళ్లిన వ్యక్తి కాకి వాగు పరిసర ప్రాంతంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపినారని తల్లి తెలిపింది. తల్లి గంగవ్వ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు.