సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) నాగర్ కర్నూల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రథమ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్, బైక్ మెకానిక్ మరియు ఎలక్ట్రికల్ బిఎస్ 6 కోర్సుల్లో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ప్రథమ్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ సంస్థ హెడ్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత వసతి మరియు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. కావున జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.వివరాలకు సంస్థ కోఆర్డినేటర్ సిహెచ్ విజయ్ ని 994998174 8 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలన్నారు.