2 మార్చి సాక్షి డిజిటల్ న్యూస్ కాటారం ప్రతినిధి చొల్లేటి బ్రహ్మచారి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దివంగత నేత స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని శ్రీపాద రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ శ్రీపాద రావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి, శాసనసభ గౌరవాన్ని కాపాడిన ఆదర్శ నాయకుడిగా గుర్తింపు పొందారు. మంథని నియోజకవర్గం నుంచి పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు అంకితభావంతో సేవలు అందించారు. అనంతరం శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించి సభా పరిపాలనలో నిష్పక్షపాత ధోరణి ప్రదర్శించారు. నాయకులు తమ ప్రసంగాల్లో ఆయన సరళ జీవన శైలి, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అనురాగం గురించి ప్రస్తావిస్తారు . యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి సందర్భంగా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు స్ఫూర్తిగా నిలిచి సమాజానికి మార్గదర్శకంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. దేశం గర్వించేదగ్గ గొప్ప నాయకుడు మన ప్రాంతవాసి కావడం మనందరికీ గర్వకారణమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
