సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (నటరాజ్ గౌడ్) మర్రి రామ్ రెడ్డి కాలనీ వెల్ఫీర్ అసోసియేషన్ నూతన కమిటీ ని సత్కరిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ .. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆరవ వర్డ్ లో గల మర్రి రామ్ రెడ్డి కాలనీ ఆదర్శవంతమైన కాలనీ గ తీర్చిదిదేందుకు ప్రత్యక నిధులతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద పేర్కొన్నారు . బోయినపల్లి ఆరవ వర్డ్ లో ని మర్రి రామ్ రెడ్డి కాలనీ వెల్ఫీర్ అసోసియేషన్ నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది ఈ క్రమం లో భాగంగా ఆదివారం కాలనీలో ప్రమాణస్వీకారం అభినందన కార్యక్రమం ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద, ముఖ్య అతిధిగా హాజరు కాగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ , మాజీ సభ్యుడు పాండు యాదవ్ , బీజేపీ నాయకుడు బానుక మల్లికార్జున్ లు అతిధులుగా పాల్గున్నారు ఈ నేపధ్యం లో మర్రి రామ్ రెడ్డి కాలనీ వెల్ఫీర్ అసోసియేషన్ కు నూతనగా ఎంపికైన ప్రసిడెంట్ మధుసూదన్ రెడ్డి , వైస్ ప్రసిడెంట్ కృష్ణ రెడ్డి , జనరల్ సెక్రటరీ మాల్యాద్రి , జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి , కోశాధికారి నర్సింహా రావు లతోపాటు నూతన కమిటీ సభ్యులను బానుక నర్మద మల్లికార్జున్ లు వారికీ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి అభినదించారు అనంతరం బానుక నర్మద మాట్లాడుతూ . గడిచిన పది నెలలో 15 కోట్ల నిధులతో కంటోన్మెంట్ ప్రాంతం ప్రగతి పాఠం లో దూసుకుపోతున్నది అని అన్నారు స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ ప్రత్యక చొరవతో గతం లో ఎన్నడూ లేని విధంగా ఎనో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు రాబోయే రోజులలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ముక్యంగా మర్రి రామ్ రెడ్డి కాలనీ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తూ రానున్నరోజులలో ఈ కాలనీ దేశం లోని కంటోన్మెంట్ ప్రాంతంలో వున్నా అన్ని కానీలకు ఆదర్శ వంతంగా ఉండేలా తీర్చిదిద్ద నున్నట్లు ఆమె తెలిపారు , కంటోన్మెంట్ ప్రాంతని సమస్య రహిత ప్రాంతంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు అందుకోసం నిత్యం ప్రజలలో వుంటూ సమస్యలు తెలుసుకుంటున్నట్లు ఆ సమస్యలు లేకుండా వెంటవెంట పరిష్కరిస్తునట్లు తెలిపారు కార్యక్రమం లో వెంకటేశ్వర్ రెడ్డి , ఈశ్వర చరణ్ , కృష్ణ యాదవ్ , రవి కిరణ్ , నర్సింహా , రమేష్ , సందీప్ పటేల్ , సాయి కుమార్ హరీష్ రెడ్డి , తదితరులు పాల్గున్నారు .
