ఐ డి ఎచ్ కాలనీ శిథిల అవస్థలో ఉన్న బ్లాకుల కు బదులు కొత్త బ్లాకులు ఎమ్మెల్యే తలసాని

సాక్షి డిజిటల్ న్యూస్ – మార్చ్ 3- సికింద్రాబాద్- బన్సీలాల్ పేట్ డివిజన్లోని ఐ.డి. హెచ్. కాలనీ లోని ( వేంబి స్కీం ) కింద ఉన్నటువంటి అతి పురాతనమైన నాలుగు బ్లాకులు అవి బ్లాక్ నెంబర్ 4. 5. 6. 10. ఇందులో 4.5.10. బ్లాక్ శిథిల అవస్థలోకి చేరడంలో ఈ మూడు బ్లాకుల కుటుంబాలు బిక్కుబిక్కు మంటూ జీవిస్తున్నారు. పోయిన వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వచ్చే వర్షాకాలానికల్లా ఏదైనా తరుణోపాయం చేస్తారని ఐ డి హెచ్ కాలనీ శిధిల అవస్థలో ఉన్న బ్లాక్ల వారు సనత్ నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కలిసి నూతనంగా బ్లాక్ లను ఏర్పాటు చేయవలసిందిగా కోరి వాళ్ళ బాధను వివరించడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించి హైదరాబాద్ కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది . ఆ తరుణంలో ఈరోజు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుండి హౌసింగ్ డిపార్ట్మెంట్ డి. ఈ. లలిత. ఏ. ఈ. సురేంద్రనాథ్ .ఏ. ఈ. సాయి చరణ్. బన్సీ లాల్ పేట్ టి.ఆర్.ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎల్. వెంకటేషన్ రాజు. ఐ.డి. హెచ్. కాలనీ శిధిలావస్థలో ఉన్న బ్లాకులను పరిశీలించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *