సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ (చిక్కెల నరేష్)ఆర్మూర్ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ దూసుకుపోతోంది. తమ శ్రమను తగ్గించిన పనిని వేగం గాపూర్తి చేసే ఆధునిక పద్దతు లను రైతులు అందిపుచ్చుకుం టున్నారు. నాట్ల నుంచి మొదలుకొని మందులు చల్లడం, పంట కోత వరకు పూర్తిగా యంత్రాలే పని చేస్తున్నాయి. అందులో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎకరాన్ని చుట్టి వచ్చే డ్రోన్ల వినియోగం గ్రామీణా ప్రాంతాల్లో చాలా పెరిగింది. జిల్లాలో వివిధ కం పెనీలు, డ్రోన్ల నిర్వాహకులు రైతులకు పరిచయం చేసి అతి తక్కువ ధరకే డ్రోన్ సేవలను అం దిస్తున్నారు. ఆర్మూర్ మండలంలోని దాదాపు అన్ని గ్రామాల రైతులు డ్రోన్ల వినియోగంపై ఆసక్తి చూపుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలకు వరికి మందు స్ప్రే చేస్తున్న డ్రోన్ డ్రోన్ వినియోగంపై ఆర్మూర్ రైతులకు అవగాహన కల్పిస్తున్న నిర్వాహకులు మందులను డ్రోన్లతోనే స్ప్రే చేయిస్తున్నారు. డ్రోన్ ద్వారా కచ్చితమైన పనితీరు కనిపిస్తోం దని రైతులు అంటున్నారు. డ్రోన్తో అన్నీ లాభాలే.. కూలీలతో చేతి పంపు ద్వారా ఎకరం పంటకు మం దు పిచికారీ చేయిస్తే గంటకు పైగా సమయం పట్ట డంతోపాటు వారికి రూ.500 నుంచి రూ.600 వరకు చెల్లించాల్సి వస్తోంది. మందుల వినియోగం సైతం ఎక్కువగా ఉంటుంది. స్ప్రే చేసిన వారి ఆరో గ్యంపై మందు ప్రభావం పడుతుంది. డ్రోన్ ద్వారా అయితే ఎకరానికి రూ.350 నుంచి 400 ఖర్చుతోనే 5 నుంచి 10నిమిషాల వ్యవధిలోనే స్ప్రే పూర్తి అవు తుంది. మందు వినియోగం కూడా తక్కువగా ఉం టుంది. రైతులు, కూలీలకు విష ప్రభావం ఉండదు అని తేలిపాడు రాజేష్ యాదవ్. 63037 14630.