ఎస్టియు ఆధ్వర్యంలో నూతన ఎంఈఓ కు సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్,మెదక్ జిల్లా, చిన్న శంకరంపేట, మార్చి 02 (మాసాయిపేట లక్ష్మణ్):- పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలని మండల విద్యాధికారి దిప్ల రాథోడ్ అన్నారు. సోమవారం మండల విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన దిప్ల రాథోడ్ ను ఎస్టియు మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … నిరంతరం అన్ని పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లోఈ కార్యక్రమం ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, సతీష్, కోశాధికారి శివ కుమార్, రాష్ట్ర కార్యదర్శి పోచయ్య, శివప్రసాద్, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు శివ నాగరాజు,వేణు మాధవ్, శ్రీకాంత్, సమియుద్దిన్, వినయ్, హనుమంతు, సంతోష్, బాలరాజు, రతన్, బాలరాజు, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.