సాక్షి డిజిటల్ న్యూస్, అనంతపురం మార్చ్ 3, అనంతపురం జిల్లా ఇన్చార్జ్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు మిత్రులారా! ఈనెల 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఉరవకొండ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగ ఆర్డిటిని రక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.కావున ఉరవకొండ ప్రాంతంలో ఆర్డిటి సంస్థ తో లబ్ధి పొందిన పేద, మధ్యతరగతి,దళిత, బహుజన కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని,అలా లేని పక్షంలో ఆర్డిటి సంస్థ ఈ ప్రాంతం నుంచి తరలిపోతే విద్య, వైద్యం,సేద్యం పేదలకు దూరమై పోవడాన్ని ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఆర్డిటిని రక్షించుకోకపోతే మన ప్రాంతం చాలా నష్టపోవడంతో పాటు వలసలు పెరిగిపోయి పేదల బతుకులకు గ్యారెంటీ లేకుండా పోతుంది. విద్య, వైద్య సేవలు నిలిచిపోయి, అన్ని రకాలుగా తీవ్ర నష్టం జరుగుతుంది. అందుకే ఈ సమస్యపై రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని దళిత, గిరిజన, బహుజన, బీసీ, అభ్యుదయ సంఘాలు,వివిధ రాజకీయ పార్టీలు పాల్గొని జయప్రదం చేయవల సిందిగా కోరుతున్నాము. వై విశ్వేశ్వర్ రెడ్డి, (ఎక్స్ ఎమ్మెల్యే) వైయస్సార్సీపి ఇన్చార్జ్. ఉరవకొండ.