ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రాం లో దివ్యాంగ విధ్యార్ధుల ప్రతిభ

సాక్షిడిజిటల్ న్యూస్,వేంపల్లె మార్చ :03 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) భవిత దివ్యాంగుల విద్యా వనరుల కేంద్రం చిన్నారులు జిల్లా స్థాయిలో ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రాం నందు ప్రతిభను చూపారు. సమగ్ర శిక్ష వైయస్సార్ కడప డిస్ట్రిక్ట్ జిల్లాస్థాయి రెండు రోజుల ఆర్ట్ మరియు కల్చరల్ ప్రోగ్రాం స్పెషల్ నీట్ చిల్డ్రన్స్ కి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి దివ్యాంగ చిన్నారులు 200 మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో గ్రూప్ డాన్స్ లో మొదటి పైస్ అదేవిధంగా ఆర్ టి క్రాఫ్ట్ లో రెండవ బహుమతిని వేంపల్లి భవిత దివ్యాంగుల కేంద్రం విద్యార్థులు సంపాదిం చారు. ఎంఈఓలు వెంకట్రామిరెడ్డి, స్టాలిన్ లు దివ్యాంగ చిన్నారులను అభినందించారు. చిన్నారులు ఎందులోనూ తీసిపోకుండా ఆత్మవిశ్వాసంతో అన్ని కార్యక్రమాలలో పాల్గొని బహుమతులు సంపాదించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. వీరు ఇంకా మరిన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు.