సాక్షి డిజిటల్ న్యూస్, అనంతపురం. మార్చ్ 3, అనంతపురం జిల్లా ఇన్చార్జ్, అనంతపురం ఈరోజు అనంత లక్ష్మి కాలేజ్ చైర్మన్ అనంత రాముడు పుట్టినరోజు సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీ సిబ్బంది ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్టీయూ ఈసీ కృష్ణయ్య మరియు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, పూణే ఎం. నరసింహప్ప విచ్చేసి సభను శోభాయమానంగా తీర్చిదిద్దారు. వారు అనంత రాముడు.విద్యా సేవలను కొనియాడుతూ, సమాజాభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ బడగా, చైర్మన్ సేవలను గుర్తుచేసుకుంటూ ప్రత్యేక సన్మానం కార్యక్రమం కూడా జరిగింది. అనంత రాముడు విద్యార్థుల శ్రేయస్సు కోసం తన కట్టుబాటును పునరుద్ఘాటించారు. చివరగా అందరూ కలిసి ఆయనకు దీర్ఘాయుష్షు, ఆయురా డాక్యుమెంట్ ఏం లేవు డాక్యుమెంట్ లేదు వాళ్ళ దగ్గర రిజిస్టర్ ఆఫీస్ లో మనం తీసుకు వచ్చాక ఎలివేషన్స్ రోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.