సాక్షి డిజిటల్ న్యూస్ మార్చి 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) సినీ నటుడు విజయ్ దేవరకొండ వివాహం సందర్భంగా తన సొంత గ్రామమైన అచ్చంపేట నియోజకవర్గం లోని తుమ్మన్ పేటలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా అచ్చంపేట పరిసర ప్రాంత విద్యార్థినీ విద్యార్థులకు ఆయన శుభవార్త చెప్పారు.అచ్చంపేట డివిజన్ లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందిస్తామని ప్రకటించారు.9వ తరగతి మరియు 10వ తరగతితో ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి, రెండవ స్థానంలో నిలిచిన విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తా మన్నారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు మరియు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.