సాక్షి డిజిటల్ న్యూస్ పిబ్రవరి.14: వేములవాడ ఆర్. సి. ఇంచార్జ్: సయ్యద్ షబ్బీర్… ఎన్నికలు అయిపోయాయి గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అడిగిన పని చేసి పెట్టండి ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి సహకరించి వార్డు అభివృద్ధి కోసం కష్టపడండి ఎన్నికల సమయంలో ఎత్తులు పై ఎత్తులు అన్ని నిన్నటివరకే
ఇరోజు నుండి అందరూ కలిసి ఉండండి ఒకే వాడకట్టు పొద్దున అయితే ఒకరి మొహం ఒకరు చూసుకునే వాళ్ళు .గెలిచిన వాడు పదవిలో ఉంటాడు, ఓడిన వాడు పక్కనే ఉంటాడు. రెండేళ్లూ, ఐదేళ్లూ కాదు. జీవితం మొత్తం కలిసి ఉండాల్సింది మనమే. పంతాలు పట్టింపులకి. పోయి శత్రువులుగా మారకండి పార్టీలు శాశ్వతం కాదు మానవ సంబంధాలు ముఖ్యం వేములవాడ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన 28వార్డు కౌన్సిలర్ లకు అబినందనలు, హార్దిక శుభాకాంక్షలు, మీ ఆధ్వర్యంలో వేములవాడ మున్సిపల్ శాఖ ప్రజలకు మంచి సేవలు అందించి తెలంగాణా రాష్ట్రము లో బెస్ట్ మున్సిపాలిటీ గా ప్రభుత్వం చే ప్రశంసలు పొంది అవార్డు తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను..