22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లత వంట భాస్కర్ ఘనవిజయం

సాక్షిడిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 2026 రిపోర్టర్ రాజు గద్వాల్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపల్ఎ న్నికల్లో 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లత వంట భాస్కర్ ఘనవిజయం సాధించారు. 114 మెజారిటీతో గెలుపొందిన ఆమెకు కార్యకర్తలు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఫలితాల ప్రకటన అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు కలిసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. , జెండాలు, నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అభివృద్ధి కోసం కృషి చేస్తానని లత వంట భాస్కర్ హామీ ఇచ్చారు. స్థానిక సమస్యల పరిష్కారం తన ప్రథమ ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు.