సుల్తానాబాద్ బల్దియాను కైవసం చేసుకున్న కాంగ్రెస్

సాక్షి డిజిటల్ న్యూస్, 14 ఫిబ్రవరి 2026, సుల్తానాబాద్ మండల్ రిపోర్టర్ టి సంజయ్ : పెద్దపల్లి జిల్లా సుల్తానా బాద్ మున్సిపాలిటీ ప్రజలు తమ ఓటుతో కాంగ్రెస్ జెండా దిగ్విజయంగా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది, 01, వ వార్డు లోఈర్ల స్వరూప(కాంగ్రెస్),02 వ వార్డులో గాజుల రాజమల్లు ( కాంగ్రెస్), 03 వ వార్డు లో కందునూరి సమత (బీజేపీ), 04 వ వార్డులో బిరుదు కృష్ణ (కాంగ్రెస్),05 వ వార్డులో గరిగే శోభారాణి (కాంగ్రెస్),06వ వార్డు లో బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్),07 వ వార్డు లో ఉట్ల వర ప్రదీప్ (కాంగ్రెస్), 08వ వార్డు లో చింతల రాజు (కాంగ్రెస్),09వ వార్డు లో టికే ప్రభాకర్ (కాంగ్రెస్), 10 వ వార్డు లో అంతటి పుష్పలత(కాంగ్రెస్),11వ వార్డులో కల్వల శంకరమ్మ (బి ఆర్ ఎస్),12 వ వార్డు లోఅమీరిశెట్టి శ్రావణి (ఏఐఎఫ్బిపి),13 వ వార్డు లో సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్),14 వ వార్డు లో వేగోళం పద్మ (కాంగ్రెస్),15 వ వార్డులో గాదాసు మంజుల (కాంగ్రెస్) లు గెలుపొందారు.సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది, ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండాను ఎగరవేసింది, మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ పార్టీ ఏకంగా 12 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఆదరణ లభించింది, బిజెపి, బిఆర్ఎస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కేవలం ఒక్కో స్థానానికి పరిమితమయ్యాయి. సుల్తానాబాద్ కౌంటింగ్ కేంద్రం ను పెద్దపల్లి డిసిపి రామ్ రెడ్డి, ఏసిపి గజ్జి కృష్ణ లు సందర్శించారు, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి , ఎస్సై చంద్రకుమార్ ల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటువల్ల కౌంటింగ్ ప్రశాంతంగా ముగిసింది.