సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 14 శుక్రవారం ఆత్రేయపురం మండల రిపోర్టర్ (టీ.వీ.కృష్ణారెడ్డి) డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు-శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తూ ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేసే పోలీసుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్,ఆలమూరు ఎసై నరేష్,కొత్తపేట నియోజక వర్గ, ఆలమూరు మండల ప్రముఖ నాయకులు అన్నారు. ఆలమూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ పదోన్నతులు పొందిన, బదిలీపై వెళ్తున్న అధికారులు, సిబ్బందికి ఆయన ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ స్థానిక కొత్తూరు ఎస్ జె ఆర్ ఫంక్షన్ హాల్ లో గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ, పోలీస్ ఉద్యోగం అనేది అత్యంత బాధ్యతతో కూడుకున్నదని, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి ఉన్నత స్థానాలకు చేరుకున్న సిబ్బందిని చూసి గర్వంగా ఉందన్నారు. ఆలమూరు పరిధిలో వీరు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఎస్సై నరేష్ మాట్లాడుతూ, పదోన్నతి పొందిన వారు తమ కొత్త బాధ్యతల్లో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని ఆకాంక్షించారు. తోటి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ క్లిష్ట సమయాల్లో కూడా మొక్కవోని ధైర్యంతో పనిచేసిన వీరి తీరు శాఖకు గర్వకారణమని ప్రశంసించారు.కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రాజకీయ, సామాజిక నాయకులు, సహా ఉద్యోగులు మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ సమాజానికి వెన్నెముక వంటిదని, ప్రజల కోసం తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తూ సేవలందించే పోలీసుల పాత్ర అమోఘమని అభినందించారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన సిబ్బందిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సభలో డి. సూర్య చంద్రరావు (SI), డి. సుబ్రహ్మణ్య స్వామి (ASI), సి.హెచ్. వీర్రాజు (HC-2536), బి. నేత్ర (HC-299), వై. రామకృష్ణ (PC-3696), ఎం. గోపాల కృష్ణ (PC-3647), ఆర్. సుబ్రహ్మణ్యం (PC-3477)లను ఘనంగా సత్కరించారు. చివరలో ఆహ్వానం మేరకు కార్య క్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు పుష్ప గుచ్చాలు,జ్ఞాపికలు అందచేసి వారి భవిష్యత్తు మరిన్ని విజయాలతో నిండాలని నాయకులు, సీఐ విద్యాసాగర్, ఎస్సై నరేష్ లు,సిబ్బంది ఆకాంక్షించారు. అనంతరం కార్యక్రమం లొ పాల్గొన్న ప్రతిఒక్కరికి చక్కని ప్రేమ విందు ఏర్పాటు చేసారు..