సచివాలయాల మార్పు శోచనీయకరం

సాక్షి డిజిటల్ న్యూస్ వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిసార్ బాషా,వేంపల్లె - ఫిబ్రవరి:14( పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్పు చేస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శోచనీయం అని వైసిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిసార్ బాషా అన్నారు. శుక్రవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ గత వైసిపి హయాంలో మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ స్వరాజ్య పాలనను అందించే దిశగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును శ్రీకారం చుట్టార న్నారు. దీంతో మండల స్థాయి పరిపాలనను గ్రామ స్థాయికి చేరువ చేశారన్నారు. గతంలో సంక్షేమ పథకాలు, ఆయా సమస్యలపై మండల కేంద్రం చూట్టు ప్రజలు తిరిగేవారని, వీటిని మార్పు చేస్తూ మాజీ సిఎం ప్రజల వద్దకు పాలన అందించే లా సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. కానీ అధికారంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం వీటిని నీరుగార్చారని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థానంలో కొత్తగా స్వర్ణగ్రామం, వార్డుగ్రామం గా పేరు మార్చడం ఎంత వరకు సమంజసం కాదన్నారు. కేవలం గత వైసిపి ప్రభుత్వం తెచ్చిన క్రిడిట్ ని జీర్ణించుకో లేక ఆ పేర్లు మార్పు చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. పేర్లును మార్చినంత సులువుగా ప్రజల గుండెల్లో నుంచి ఆ ముద్ర తొలగించలేరని, ఆ వ్యవస్థని తెచ్చిన ఘనత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కేవలం రాజకీయ కక్ష్య సాధింపు తప్ప, ప్రజలకు పథకాలను అమలు చేయడంలో టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ప్రజల్లో నాటుకు పోయిందన్నారు. ఇప్పటికైనా పేర్ల మార్పు కార్యక్రమాలను పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయాలని టిడిపి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు.