షాద్‌నగర్ వార్డ్ నంబర్ 26లో ‘కారు’ జోరు: బుర్రి శివ ఘన విజయం!

సాక్షి డిజిటల్ న్యూస్, 14 ఫిబ్రవరి, షాద్ నగర్/రిపోర్టర్/కృష్ణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అందరి దృష్టిని ఆకర్షించిన షాద్‌నగర్ మున్సిపాలిటీ 26వ వార్డు ఫలితం వెలువడింది. ఈ హోరాహోరీ పోరులో బి.ఆర్.ఎస్ (BRS) పార్టీ మద్దతు నిలిపిన అభ్యర్థి బుర్రి శివ ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.
​అభివృద్ధికి పట్టం కట్టిన 26వ వార్డు ఓటర్లు. ​ మొదటి నుండి ప్రచారంలో దూసుకుపోయిన బుర్రి శివ, పోలింగ్ రోజున కూడా అదే జోరును ప్రదర్శించారు. ​స్థానిక సమస్యల పరిష్కారం, వార్డు సర్వతోముఖాభివృద్ధికి శివ గారు చేస్తానన్న వాగ్దానాలకే ప్రజలు మొగ్గు చూపారు. శివ గారి గెలుపుతో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది. బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ​”ఈ విజయం 26వ వార్డు ప్రజల విజయం. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరుకు రుణపడి ఉంటాను. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *