సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: శివరాత్రి పండుగను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా, కోట మండల పరిధిలోని వీరారెడ్డి సత్రం వద్ద ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మల్లు భాస్కర్ రెడ్డి, మల్లికార్జున గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున గౌడ్ మాట్లాడుతూ 14 తేదీ శనివారం ఉదయం 8 గంటలకు వీరారెడ్డి సత్రం వద్ద ఈ బలప్రదర్శన జరుగుతుందన్నారు. కోటా, వాకాడు, చిట్టమూరు, గూడూరు, చిల్లకూరు మండలాల నుంచి ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉత్సాహకులు ఎంట్రీ ఫీ 500 చెల్లించాలని పేర్కొన్నారు. ఎడ్ల బల ప్రదర్శనలో ప్రథమ బహుమతి 30000, ద్వితీయ బహుమతి 20000, తృతీయ బహుమతి 10000, చతుర్ద బహుమతి5000, పంచమ బహుమతి 3000 ప్రకటించామన్నారు. మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న సాంస్కృతి కార్యక్రమం కార్యక్రమంలో మండలాలలోని ప్రజలు పాల్గొని విజయవంతం కోరుతున్నామన్నారు.వివరాలకు 7288998999, 9959220092, నెంబర్లను సంప్రదించలన్నారు.