సాక్షి డిజిటల్ న్యూస్ హోళగుంద ఫిబ్రవరి 14, హోళగుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆధ్వర్యంలో వైద్య పరికారాలు పంపిణీ చేశారని మేనేజర్ మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ ఒకొక్క మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరియు సబ్ సెంటర్లకు గాను 1,92, రూపాయల విలువగల వైద్య పరికరాలను పంపిణీ చేశారన్నారు గ్రామీణ ప్రజల కోసం నాణ్యమైన వైద్యం సదుపాయం అందించాలన్నారు వైద్య పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ న్యూటన్ బిందు మాధవి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
