వేంపల్లి శ్రీ చైతన్య హై స్కూల్‌లో మహా శివరాత్రి ప్రీ సెలబ్రేషన్స్

*పాఠశాల చైర్మన్ బి. చక్రపాణి రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి:14, వేంపల్లి (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసుల ఆంజనేయులు ) వేంపల్లి శ్రీ చైతన్య హై స్కూల్‌లో మహా శివరాత్రి సందర్భంగా ప్రీ సెలెబ్రేషన్స్ ను భక్తి, శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక వాతావరణంలో ఈవేడుకలను నిర్వహించారు.ఈకార్యక్రమంపరమేశ్వరునికి ప్రత్యేక పూజలతో, జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమైంది. అనంతరం విద్యార్థులు భక్తిగీతాలు ఆలపించి, మహా శివరాత్రి ప్రాముఖ్యతను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలనుప్రదర్శించారు.శివుడు,పార్వతిదేవి వేషధారణలో వచ్చిన చిన్నారులు అందరినీ ఆకట్టు కున్నారు. సందర్భంగా పాఠశాల ఛైర్మన్ బి. చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ, “మహా శివరాత్రి మనకు ఆత్మశుద్ధి, నియమం, భక్తిమరియు క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా సంస్కారాలలో కూడా ముందుండాలి. “భక్తి, వినయం, కృషి ఉంటే ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు” అని పేర్కొన్నారు.పాఠశాల డైరెక్టర్లుబి. చేతన్ రెడ్డి మరియుబి. చైతన్యరెడ్డి పాల్గొని,ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొంది స్తాయని, విద్యతో పాటు విలువలు సమానంగా అవసరమని వారుతెలిపారు. ఉపాధ్యాయులు మహా శివరాత్రి పర్వదినం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను వివరించి, సత్యం, నియమం, భక్తివంటి విలువలను జీవితంలోఆచరించాలనివిద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రాంగణమంతా భక్తి, శ్రద్ధలతో కళకళలాడుతూ శివనామస్మరణతో దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *