వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ.

★పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

సాక్షి డిజిటల్ న్యూస్: 14 ఫిబ్రవరి, పాల్వంచ.రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఐడీఓసీ కార్యాలయం నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ప్రతి దశను పర్యవేక్షిస్తూ, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా లెక్కింపు జరుగుతోందని, కౌంటింగ్ హాళ్లలో భద్రతా చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియను ఆయన నిశితంగా గమనించారు.