విజయ దుర్గా దేవి 12వ వార్షికోత్సవము అత్యంత వైభవంగా జరిగిన సంబరం

సాక్షి డిజిటల్ న్యూస్ ఫిబ్రవరి 13 శుక్రవారం ఆత్రేయపురం మండల రిపోర్టర్ (టీ.వీ.కృష్ణారెడ్డి) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాలెం గ్రామం సోమ సుందర రెడ్డి నగర్ దేవి సెంటర్లో వేంచేసియున్న పిలిస్తే పలికే తల్లి భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ తన చల్లని చూపుతో భక్తులను ఎల్లవేళలా కాచి కాపాడుతున్న మన లోకమాత విజయ దుర్గ అమ్మవారి 12వ వార్షికోత్సవ సంబరాలు కనుల వైభవంగా జరిగినాయి ఉదయం 6 గంటలకు అమ్మవారికి ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పళ్ళ రసాలు గంధం నదీ జలాలతో అభిషేకం జరిపి అమ్మవారికి పసుపు కుంకుమ వస్త్రాలు సమర్పించారు . అనంతరం ఉదయం 8 గంటల నుండి భక్తులకు దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు తరువాత ఉదయం 10 గంటల నుండి శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహం రథం పై పల్లకి పెట్టి సోమ సుందర్ రెడ్డి నగర్ కాలనీ ప్రతి వీధి వీధికి తిరిగి భక్తులకు దర్శనమిచ్చింది ఈ కార్యక్రమంలో చింతలూరు నుండి వచ్చిన గరగల బృందం వారు వారి నృత్య ప్రదర్శనలతో భక్తులు మనసులు ఆనందపరిచారు అలాగే సాయంత్రం మహిళలందరూ కలిసి లలితా సహస్రనామములు చదివి
అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది.