రేలారే రేలా కార్యక్రమానికి ఎంపికైన గుగులోత్ అఖిలకు సన్మానం

సాక్షి డిజిటల్ న్యూస్, ఫిబ్రవరి 14, మల్లాపూర్ మండలం రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య: మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన గుగులోత్ అఖిల ఇటీవల రేలారే రేలా కార్యక్రమానికి ఎంపికయ్యారు . ఈ సందర్భంగా ఆమెను బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్ నిర్వాహకులు రాకేష్ మకిలి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ & బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్ సలహాదారులు పెద్దిరెడ్డి లక్ష్మణ్ ఆమె ప్రతిభను గుర్తించి ఆమెను శాలువాతో సన్మానించి అభినందించారు. మల్లాపూర్ గ్రామానికి గర్వకారణంగా నిలిచిందని అన్నారు. తన మధుర గాత్రంతో చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటూ ఒక్కసారిగా తన ప్రతిభతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పాటల రంగంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అఖిలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చినప్పటికీ, సొంతంగా పాటలు రాసి పాడే కళతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అనేక మందిని ఆకర్షిస్తూ ముందుకు సాగుతోందని అభినందించారు. అఖిల ప్రతిభను గుర్తించిన జైశిలాన్ స్టూడియో వారు “బురి బురి” అనే గోండు పాటలో ఆమెకు ప్రముఖ పాత్ర ఇవ్వగా, ఆమె నటన మరియు నృత్యంతో ఆ పాటకు మంచి స్పందన లభించి భారీ వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా అఖిల రచన మరియు స్వరంతో బుజ్జితల్లి మ్యూజిక్ ఛానల్‌లో ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని వారు తెలిపారు. మమతా స్టూడియో వేదికగా గుగులోత్ అఖిలను ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో రాకేష్ మకిలి, పెద్దిరెడ్డి లక్ష్మణ్, దూరిశెట్టి శ్రీనివాస్ మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు. అఖిల రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని మల్లాపూర్ గ్రామానికి మంచి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు .