సాక్షి డిజిటల్ న్యూస్ పటాన్చెరు నియోజకవర్గం ప్రతినిధి.. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలోని రామేశ్వరం బండ ఇందిరమ్మ సింగల్ బెడ్ రూమ్ లను శుక్రవారం హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మరియు అధికారులు పర్యటించి ఇందిరమ్మ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. లబ్ధిదారులందరూ కేటాయించినటువంటి ఇండ్లలో ఉన్నారా లేరా అని మరియు నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లను, అక్కడి వారితో చర్చించి తెలుసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా అభివృద్ధి చేయాలని అలాగే ఎక్కడెక్కడ అయితే నీటి సరఫరా ఆగిపోతుందో అక్కడ పరిశీలించాలని పై అంతస్తు వరకు నీటిని వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.