మా గిరిజన గ్రామాల సమస్య పరిష్కరించండి మహాప్రభో

సాక్షి డిజిటల్ న్యూస్ అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం NR పురం గ్రామ పంచాయతీ లో 16 యాంబ్లెట్ విలేజెస్ ఉన్నాయి. ఈ 16 గిరిజన గ్రామాల ప్రజలకి 1975 లో సుమారు 500 కుటుంబాలకు ప్రభుత్వం వారు D పట్టాలు ఇచ్చి యున్నారు. ఈ మధ్య కాలంలో ఫారెస్ట్ అధికారులు అది ఫారెస్ట్ ల్యాండ్ అని ప్రభుత్వ భూమి కాదని రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదే విషయం పట్ల జిల్లా అధికారులకు. ప్రజా ప్రతినిధులుకు వినతిపత్రాలను ఇస్తూ. ఈ పంచాయతీ కి రి సర్వే చేసి. వారికి ఇచ్చిన D పట్టాలను రెవిన్యూ పరిధిలో తీసుకొని ఫ్రీ హోల్డ్ చేసి జిరాయితీ గా భూమిని అప్పగిస్తారని కోరుకుంటున్నారు.. ఇప్పుడిప్పుడే ఈ పంచాయతీ టూరిజం డెవలప్మెంట్ అవుతున్న సమయంలో వారికి ఉపాధి కలుగుతున్న తరుణంలో సుమారు యాభై ఏళ్ళ తర్వాత ప్రభుత్వ భూమిని ఫారెస్ట్ భూమి అనడం భయబ్రాంతులకు గురి అవుతున్నారు. ఆ పంచాయతీ నాన్ షెడ్యూల్ అవ్వడం వలన ఇప్పుటికే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ D పట్టాలు కూడా ఫారెస్ట్ భూమి అంటే ఇంకా ఇబ్బందులకు గురి అవుతామణి గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రెవిన్యూ రీ సర్వే చేసి వారికిచ్చిన D పట్టా ప్రభుత్వ భూమిని ఫ్రీ హోల్డ్ చేసి వారికి అప్పగించగలరని ప్రభుత్వనికి NR పురం గిరిజన గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.