మామిడి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై శిక్షణ కార్యక్రమము

సాక్షి డిజిటల్ న్యూస్ , ఫిబ్రవరి 14 రొంపిచర్ల మండలం, రిపోర్టర్  భీమనేని బాలకృష్ణ, గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ నీలకంఠారెడ్డి మామిడి తోట నందు రైతులకు శిక్షణ కార్యక్రమం జరిగింది.ఈ శిక్షణ కార్యక్రమానికి గంగాధర నెల్లూరు,రామకుప్పం,పులిచర్ల రొంపిచర్ల మరియు చంద్రగిరి మండలాల నుండి రైతులు  150  మంది పాల్గొనడం జరిగింది. రైతుల దగ్గర నుంచి మామిడి పంటకు వచ్చే రోగాల గురించి సమస్యల గురించి తెలుసుకున్న తరువాత కషాయాలు తయారు చేసుకోవడం గురించి వివరించారు. లక్ష్మానాయక్  శిక్షణ ఇస్తూ ఘనజీవామృతం, ద్రవజీవామృతం,నీమాస్త్రం  బ్రహ్మస్త్రం, చేప బెల్లo ద్రావణం, పుల్లటి మజ్జిగ పైన తెలిపిన కషాయాలు ఎలా తయారు చేసుకోవాలి ? మరి తయారుచేసి చూపించడం తయారు చేసినటువంటి కషాయాలను మామిడి చెట్లకు ఎలా ఉపయోగించాలి, ఉపయోగించి చూపించడం  ఈ శిక్షణలో శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో పాటించవలసిన తొమ్మిది సూత్రాల గురించి వివరించడం జరిగింది. ఈ శిక్షణకు కింద తెలిపిన అధికారులు పాల్గొనడం జరిగింది.
ఐ.మురళి జిల్లా వ్యవసాయ అధికారి చిత్తూరు, వి.లక్ష్మా నాయక్ చీఫ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆఫీసర్, రామకృష్ణారావు శాస్త్రవేత్త, పురుషోత్తం ఐటిసి కె.శివ శంకర్ డిపిఎం చిత్తూరు, ఏ షణ్ముగం  డిపిఎం, ఎస్ అమృతవల్లి  డిపిఎం, స్టేట్ మార్కెటింగ్ నుండి లోకేష్ కుమార్ పి ఈ గుంటూరు. మార్కెటింగ్ టీమ్, వీరితోపాటు ఐ టి సి టీం, ఆర్ డి ఎస్  ఎన్జీవో టీం,  ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.