మహిళా జాతికి మణిపూస సరోజిని నాయుడు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయంతి వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లె, ఫిబ్రవరి: 14 డా. బాలకొండ గంగాధర్ (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసల ఆంజనేయులు) స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సరోజిని నాయుడు జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చరిత్ర అధ్యాపకుడు డా. బాలకొండ గంగాధర్ మాట్లాడుతూ భారత స్వాతంత్రోద్యమంలో సరోజిని నాయుడు అగ్రగామిగా నిలిచారని తెలిపారు. స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, స్వాతంత్రానంతరం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళా గవర్నర్‌గా, భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిచారని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ఆమె ప్రేరణగా నిలిచారని చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ సి. నాగేంద్ర మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సరోజిని నాయుడు వంటి మహనీయులు అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెలుగు శాఖాధిపతి డా. ఎల్. నాగలక్ష్మి దేవి మహిళా విద్యార్థులు స్వయంకృషితో ఎదగాలని సూచించారు. అలాగే గ్రంథాలయ శాఖాధిపతి పొట్లన్నగారి మాధవరావు చరిత్రలో మహిళల విశిష్ట పాత్రను ప్రస్తావించారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సంవత్సరం విద్యార్థిని సిరిగిరెడ్డి రాజేశ్వరి సరోజిని నాయుడు జీవిత విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ సైన్స్ శాఖాధిపతి నీల కిరణ్మయి, షఫీ ఉద్దీన్, పీడీ తేజేంద్ర, ప్రసాద్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ అరవింద్ తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *