మహాశివరాత్రి సందర్భంగా ఉమామహేశ్వరంలో సత్యహరిచంద్ర నాటకం పోస్టర్ విడుదల

సాక్షి డిజిటల్ న్యూస్ అచ్చంపేట రూరల్( రిపోర్టర్ కాలూరి మల్లేష్ ) మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరంలో ప్రదర్శించనున్న శ్రీ సత్య హరిచంద్ర నాటక పోస్టర్ను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆవిష్కరించారు శ్రీ వెంకటేశ్వర కళామండలి వారిచే ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సహకారంతో ఈ నాటకాన్ని ఉచితంగా ప్రదర్శించరున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడంలో నాటక కళా కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు శివరాత్రి రోజున భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేందుకు ఇలాంటి ప్రదర్శన దోహద పడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో నాట్య మండలి సభ్యులు దేవస్థానం కమిటీ ప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *